కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద ఇప్పటికే 13 విడతల రూపంలో రూ.2000 చొప్పున అర్హులైన రైతుల ఖాతాలో డబ్బు జమ చేసిన విషయం తెలిసిందే ఇప్పుడు పీఎం కిసాన్ 14వ విడత నవీకరణ కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ 14వ విడత మే లేదా జూన్ నెలలో విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇందుకోసం ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో సన్నహాలు చేస్తోందని సమాచారం. అయితే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడ లేదు.


ఇదిలా ఉండగా ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద రైతులకు సంవత్సరానికి మూడుసార్లు రూ.2 వేల చొప్పున మూడు వాయిదాలలో 6000 రూపాయలను ప్రతి సంవత్సరం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లోకి కేంద్ర ప్రభుత్వం నేరుగా జమ చేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా చిన్న , సన్నకారు రైతులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభించింది . ఇకపోతే ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద ప్రభుత్వం ఒక సంవత్సరంలో మూడు విడుదలగా రైతులకు రూ. 6000 ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది.

ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు 13 విడతల్లో రైతులు తమ ఖాతాల్లో డబ్బు పొందారు. ఇక 13వ విడత లబ్ధి పొందని రైతులకు 13, 14 వ విడతకు కలిపి రైతుల ఖాతాల్లో చేరుతుందని అంటే నాలుగు వేల రూపాయలు అర్హులైన రైతుల ఖాతాలో జమ అవుతుందని సమాచారం. ఇప్పటికే చాలామంది రైతులకు ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి కాలేదు దీంతో వారికి 13వ విడత డబ్బు రాలేదు కాబట్టి ఇప్పుడు పెద్ద ఎత్తున రైతులు తమ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేశారు అందుకే త్వరలోనే ఈ రైతులకు రూ.2 వేలకు బదులుగా రూ 4000 వచ్చే అవకాశం ఉంది. ఏది ఏమైనా రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా వారికి ఆర్థిక నష్టాన్ని పూడుస్తోందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: