సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ యదేచ్చగా కొనసాగుతుందని ఇటీవల కాలంలో హీరోయిన్లు చెబుతుంటే ప్రతి సామాన్యుడికి అర్థమవుతుంది. సినీ అవకాశాల కోసం ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రతి అమ్మాయిని వాడుకొని వదిలేసే నిర్మాతలు, హీరోలు, అసిస్టెంట్ డైరెక్టర్లు, డైరెక్టర్లు, చిన్నపాటి నటులు సినీ పరిశ్రమలో కోకొల్లలు. ఈ కామాంధులకు ఆ హీరోయిన్, ఈ హీరోయిన్ అనే తేడా ఉండదని... ప్రతి హీరోయిన్ తో తమ కామ వాంఛను తీర్చుకునేందుకు తపన పడుతుంటారు అని నచ్చావులే సినిమాలో హీరోయిన్ గా నటించిన ముద్దుగుమ్మ మాధవీలత తాజాగా వెల్లడించింది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఆ విషయాలకు ప్రత్యేకమైన కోడ్ పదాలను వాడతారని... ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంటుందని మాధవీలత చెప్పుకొచ్చింది. 


ఎవరైనా ఒక హీరోయిన్ వద్దకు వచ్చి షాపింగ్ కి వస్తావా అని అడిగితే... దానికి అర్థం రాత్రికి రూమ్ కి వస్తావా అని అడిగినట్లుట. సెక్స్ చేయడానికి వస్తావా అని అడగలేక... షాపింగ్ కి వస్తావా? డేటింగ్ కి వస్తావా? లంచ్ కి వస్తావా? అని అడుగుతారట. షాపు ఓపెనింగ్ కి రమ్మంటారని ఆ తర్వాత ఇంకాస్త కోపరేట్ చేయాలని అడుగుతారని... ఇంట్రెస్ట్ ఉంటే ఓకే చెప్పాలి లేకపోతే నాట్ ఇంట్రెస్టేడ్ అని చెప్పాలంటూ ఆమె సినీ ఇండస్ట్రీలో సెక్స్ కి ఏ కోడ్ పదాలను వాడతారో చాలా చక్కగా వివరించింది.


షాపింగ్, షాప్ ఓపెనింగ్ కి వస్తావా అని అడిగితే కుర్ర హీరోయిన్లు తల ఊపుకుంటూ వెళ్లకూడదని ఆమె హెచ్చరించింది. ఏది ఏమైనా ప్రతిభ ఉన్న ఆడవాళ్లు మాత్రమే సినీ ఇండస్ట్రీలో రంగప్రవేశం చేసి వ్యక్తిత్వం కోల్పోకుండా అగ్ర తారలుగా కొనసాగుతున్నారు. ఖడ్గం సినిమాలో రవితేజ చెప్పినట్టు సినిమా అవకాశాలు రాకపోయినా పర్లేదు గానీ మేము క్యారెక్టర్ అసలు కోల్పోమని చాలామంది ఖరాఖండిగా చెబుతూ ఎన్నో అవకాశాలను వదిలివేసిన వారు, సినీ ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చిన వారూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: