తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభంజనం సృష్టిస్తున్న సినిమా ‘బాహుబలి’. ఈ సినిమా ధాటికి ఇప్పట్లో ఏ సినిమా రిలీజ్ అయినా కష్టకాలమే అనుకున్నారో ఏమో కాని అల్లరి నరేష్ సినిమా  ‘జేమ్స్ బాండ్’, ‘నేను కాదు, నా పెళ్ళాం’ ఈ నెల 17 విడుదల కావాల్సి ఉన్నా దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కామెడీ కాన్సెప్ట్స్ తో తెలుగు ప్రేక్షకులను నవ్విస్తున్న అల్లరి నరేష్ లేటెస్ట్ జేమ్స్ బాండ్ చిన్న సినిమా కాబట్టి బాహుబలి సినిమా ధాటికి నిలుస్తుందా అన్న సందేహంలో పడ్డారు.  


జేమ్స్ బాండ్ పోస్టర్


ఇప్పటికే బాహుబలి బాక్స్ ఆఫీసు వద్ద హల్ చల్ చేస్తుండడంతో ఆ సినిమాకి ఈ వారం కూడా లైన్ క్లియర్ చేస్తూ ‘జేమ్స్ బాండ్’ సినిమాని వాయిదా వేసారు.  ఒక వారం ఆలస్యంగా జూలై 24న సినిమాని రిలీజ్ చేయనున్నారు. అల్లరి నరేష్ సరసన మాఫియా డాన్ వైఫ్ గా సాక్షి చౌదరి నటించింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: