జిల్ సినిమా డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా రూపొందుతున్న రాధే శ్యామ్  సినిమా గురించి అందరికి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీస్ - యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై రూపొందుతోంది.అలాగే హిందీలో రాధే శ్యామ్ ని టీ-సిరీస్ భూషణ్ కుమార్ విడుదల చేయనున్నారు. 1960ల నాటి బ్యాక్ డ్రాప్ లో భారీగా రూపొందుతున్న ఈ సినిమాలో విక్రమాదిత్యగా ప్రభాస్ ,  ప్రేరణగా పుజా మనకు కనిపించబోతున్నారు.

ఇక ఈ సినిమాకు 10 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని టాక్. పరిస్థితులు అన్ని మాములుగా చక్కబడితే మిగిలిన బ్యాలెన్స్ షూట్ పూర్తి చేయనున్నారు. ఇక విడుదల తేదీపై ఈ మూవీ టీం ఇంకా స్పష్టత ఇవ్వాల్సి ఉంది.అయితే ఈ సినిమా తర్వత ప్రభాస్ ఇంకొక ప్రేమకథలో నటించబోతున్నారు అని టాక్. ప్రభాస్ తో ఇంతకముందు డార్లింగ్ అనే సినిమా చేసి సూపర్ హిట్ కొట్టిన దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వంలో ప్రభాస్ ఇంకొక సినిమా ఒప్పుకున్నారు అని టాక్. ఈ సినిమా కూడా ఒక పక్క లవ్ స్టొరీ గా రాబోతుందట.ఇక ప్రభాస్ ప్రస్తుతం అధిపురుష్ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలలో నటిస్తున్నారు. 

ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే నాగ అశ్విన్ దర్శకత్వంలో ఇంకొక సినిమా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనే ఇంకొక సినిమా కూడా లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ ఐపోయాకనే ప్రభాస్ కరుణాకరన్ సినిమా మొదలుపెట్టేలా లేడు. ఇవన్నీ పూర్తి అయ్యే సరికి కనీసం వచ్చే ఏడాది అన్న పడుతుంది. అయితే ప్రభాస్ ని డార్లింగ్ సినిమాలో లాగా ఫన్నీ పాత్రలో మళ్ళీ చూడబోతున్నారు ఆయన అభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇక ఈ సినిమాలు అన్ని అయిపోయే వరకు కరుణాకరన్సినిమా స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: