టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్‌గా సత్యదేవ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఆయన నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం విడుదల కాగా, థియేటర్స్‌లో ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఈ ఫిల్మ్‌లో సత్యదేవ్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రియాంక జువాల్కర్ నటించింది. ఇక సత్యదేవ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ ఆర్టిస్ట్ అయిపోయారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వెళ్లిపోయాడు. కొవిడ్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ టైంలో అందరు టాలీవుడ్ హీరోలు ఇళ్లలోనే ఉంటే సత్యదేవ్ మాత్రం వెబ్ సిరీస్‌లు, ఓటీటీలో విడుదలయ్యేందుకుగాను సినిమాలు చేశాడు. అవి ఓటీటీ వేదికగా విడుదలై సక్సెస్ కూడా అయ్యాయి.

 సత్యదేవ్ ప్రస్తుతం నటిస్తున్నఇంట్రెస్టింగ్ మూవీ ‘హబీబ్’. హిందీ భాషలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తీవ్రవాదం నేపథ్యంలో ఉంటుదని తెలుస్తోంది. ఈ సినిమా త్వరలో విడుదల కాబోతుండగా, ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో సత్యదేవ్ ఫుల్ బిజీగా ఉన్నాడు.  ఈ చిత్రం నుంచి ఇటీవల ఆఫ్ఘన్ సాహిత్యంతో తెరకెక్కించిన సాంగ్ విడుదల కాగా, అది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. తీవ్రవాదుల వలలో చిక్కుకున్న తన కుమారుడిని కాపాడుకునేందుకుగాను హీరో సత్యదేవ్ వారి వద్దకు వెళ్లునున్నట్లు విజ్యువల్స్ ద్వారా తెలుస్తోంది. ‘హబీబ్’ ఫిల్మ్ షూటింగ్ కథానుసారంగా ఆప్ఘనిస్తాన్ పరిసరాల్లోనే చిత్రీకరించారట మేకర్స్. షూటింగ్ చేస్తున్న క్రమంలో తనకు ప్రాణాపాయ బెదిరింపులు వచ్చాయని, చంపేస్తామంటూ బెదిరించారని సత్యదేవ్ తెలిపారు. ఆప్ఘాన్ రాజధాని కాబూల్‌లో బెదిరింపుల మధ్యనే సత్యదేవ్ ‘హబీబ్’ షూటింగ్‌లో పాల్గొన్నాడు.
 
‘హబీబ్’ చిత్రం కాబూల్‌లో షూటింగ్ జరుపుకున్న మొదటి దక్షిణ భారతీయ సినిమాగా రికార్డు కెక్కనుంది. సత్యదేవ్ ఈ చిత్రంతో పాటు ‘స్కైలాబ్, గుర్తుందా శీతాకాలం, గాడ్సే’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘గుర్తుందా శీతాకాలం’ ఫిల్మ్‌లో సత్యదేవ్‌కు జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటిస్తుండగా, ఓ కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ సుహాసిని మణిరత్నం కనిపించనుంది. మెగాస్టార్ చిరు ‘లూసిఫర్’ రీమేక్‌లోనూ సత్యదేవ్ కీ రోల్ ప్లే చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: