తెలుగు సినిమా పరిశ్రమలో ఎమోషనల్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ప్రేక్షకులు. ఆ నేపథ్యంలో వచ్చిన ఎన్నో సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో మెప్పించగా ఓ సినిమా మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది. ఆ విధంగా మానవ విలువలను ఎంతో చక్కగా తెరపై చూపించిన సినిమా ఊపిరి. 2016 లో విడుదలైన ఈ సినిమా కు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించగా ఫ్రెంచ్ లో తెరకెక్కిన ది ఇన్ తచబుల్స్ అనే సినిమా ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల అయిన ఈ సినిమాలో అక్కినేని నాగార్జున కార్తీక్ హీరోలుగా నటించారు.

ఓ ప్రమాదంలో కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి వీల్ చెయిర్ కి అంకితమై పోయిన నాగార్జున ఓక కేర్ టేకర్ కోసం చూస్తూ ఉండగా ఎంతోమంది నీ ఇంటర్వ్యూ చేసిన నాగార్జున అందరూ ప్రొఫెషనల్ గా ఉండడం చూసి ఆయనకు ఎవరు నచ్చలేదు కానీ కార్తీ నాగార్జునను చూసే కోణం కొత్తగా అనిపించి ఆయనను పనిలో పెట్టుకుంటాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది కానీ కార్తి కి ఉన్న ఫ్యామిలీ ఇబ్బందులు ఆయనను వెళ్లి పోవాల్సి గా చేస్తుంది. వద్దు అనుకుంటూనే ఇద్దరు విడిపోతారు. వారిద్దరి మధ్య అలాంటి బంధం ఏర్పడింది కొన్ని రోజులలోనే.

వీరిద్దరి మధ్య కొన్ని సీన్లు మానవతా దృక్పథం గా, మానవ బంధాల విలువలను తెలియపరచే విధంగా గా ఉంటాయి. దర్శకుడు వంశీ పైడిపల్లి ఎంతో చక్కగా ఈ సినిమాని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా తెరకెక్కించాడు. అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా పాటలు ఈ చిత్రాన్ని వేరే రేంజ్ కి తీసుకెళ్ళాయి అని చెప్పవచ్చు. 65 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 85 కోట్ల వసూళ్లను చేసుకొని మంచి సినిమాగా మిగిలిపోయింది. గోపీసుందర్ సంగీతం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ ఇద్దరు హీరోల మధ్య వచ్చే కొన్ని పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: