నేచురల్ స్టార్ నాని స్వయంకృషితో సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడు స్టార్ హీరోగా ఎదిగాడు. ఎలాంటి అంచనాలు లేని సినిమాలతో వచ్చి వాటితో సూపర్ హిట్ అందుకొని మీడియం రేంజ్ హీరోగా ఎదిగాడు. ఆ విధంగా కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరో గా ఇంత దూరం వచ్చాడు. అష్టా చమ్మా సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న నాని హీరోగా టాలీవుడ్ కి పరిచయం అవ్వగా ఆ తరువాత ఈగ, నిన్ను కోరి, నేను లోకల్, కృష్ణార్జున యుద్ధం, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ, మిడిల్ క్లాస్ అబ్బాయి వంటి సినిమా తో మినిమ గ్యారెంటీ హీరోగా ఎదిగాడు.

నాని గురించి చెప్పాలంటే ఆయన కథలు ఎంతో బాగుంటాయని, తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ సినిమా చేస్తాడని అందుకే ఆయన సినిమాలు ప్రేక్షకులు తప్పక అలరిస్తాయి అని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఆ నేపథ్యంలోనే భీమిలి కబడ్డీ జట్టు, పిల్లజమీందార్, అలా మొదలైంది వంటి సినిమాలు నానికి మంచి పేరును తీసుకురాగా ఆ తరువాత కొన్ని చిత్రాలు చేసి అందరిని మెప్పించి హిట్ లు సాధించాడు. 

ఈ నేపథ్యంలో గత కొన్ని సినిమాలు నాని వరుస పరాజయాలు ఎదుర్కోవడం ఆయన అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు. ఆయన హీరోగా చేసిన కృష్ణార్జున యుద్ధం దేవదాసు గ్యాంగ్ లీడర్ వి టక్ జగదీష్ సినిమాలు 5 కూడా భారీ ఫ్లాప్ కావడంతో నాని కెరీర్ ప్రమాదంలో ఉందని చెప్పవచ్చు. ఇటీవలే ఎన్నో అంచనాలు ఉన్న జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కాగా ఈ చిత్రం కూడా ప్రేక్షకులను భారీగా నిరాశపరిచింది దాంతో ఇప్పుడు ఆయన ఇప్పుడు చేస్తున్న రెండు సినిమాలు ఎటు కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడగా ఈ సినిమాలు నాని కి మంచి హిట్ ను అందిస్తాయో చూడాలి. ఇతర హీరోలు వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతుంటే నాని మాత్రం లోకల్ సినిమాలతో కూడా మెప్పించలేక పోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: