నితిన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రాలు ఈ మధ్య కాలంలో భారీ ఫ్లాపులు అవుతున్నాయి. దాంతో ఆయన ప్రేక్షకులకు నచ్చే సినిమా చేసి తన కెరీర్ ను నిలబెట్టే హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. ఇటీవలే మాచర్ల నియోజకవర్గం అనే సినిమాను మొదలు పెట్టాడు నితిన్. ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కానీ నితిన్ నిలబడాలంటే ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాల్సిన పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం శర వేగంగా షూటింగ్ జరుపుకుంటు ఉండగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది. 

కెరియర్ మొదట్లో ఎక్కువగా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించేవాడు నితిన్.  అయితే ఎప్పుడైతే ఆ సినిమాలు ప్రేక్షకులను మెప్పించడం లో బెడిసికొట్టాయో అప్పటి నుంచి మళ్ళీ లవ్ సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపారు. ఇష్క్ తర్వాత ఇప్పటి వరకు ఎక్కువగా లవ్ స్టోరీ సినిమాలు చేశాడు నితిన్.  అయితే తొలిసారిగా మళ్లీ నితిన్ యాక్షన్ ఓరియంటెడ్ సినిమా చేసే విధంగా ముందడుగు వేస్తున్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడని గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

దీనికి సంబంధించిన ఓ కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. తొందర్లోనే ఈ సినిమా పట్టా లెక్కబోతుంది అని అంటున్నారు. అంతే కాదు ఈ సినిమా పక్క మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోందని తెలుస్తోంది. నా పేరు సూర్య సినిమా తో దర్శకుడిగా మారిన ఈ అగ్ర రచయిత తన రెండవ సినిమాతోనే సూపర్ హిట్ కొడతాడా అనేది చూడాలి. భీష్మ సినిమా విజయం తర్వాత ఇప్పటివరకు రెండు సినిమా చేసిన నితిన్ ఎటువంటి హిట్ అందుకొని నేపథ్యం లో ఈ సినిమా అయినా ఆయనకు హిట్ తీసుకు వస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: