'సమ్మోహనం' 'వి' సినిమాల తర్వాత సుధీర్ బాబు - ఇంద్రగంటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి''.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇంకా టీజర్ అనేవి మంచి స్పందన తెచ్చుకున్నాయి.ఇక ఈ క్రమంలో వాలెంటైన్స్ వీక్ కానుకగా తాజాగా 'కొత్తకొత్తగా' అనే ఫస్ట్ సాంగ్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.ఇక 'ఓ అల్లంత దూరంగా నువ్వూ నీ కన్ను నన్నే చూస్తుంటే ఏం చేయాలో.. ఓ రవ్వంత గారంగా నాలోని నన్ను మాట్లాడిస్తుంటే ఏం చెప్పాలి' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ శ్రోతలను ఎంతగానో అలరిస్తోంది. దర్శకుడైన సుధీర్ బాబు..ఇక కృతితో సినిమా చేస్తున్న క్రమంలో వీరి మధ్య చిగురించిన ప్రేమను ఈ 'కొత్త కొత్తగా' పాటలో చూపించారు. ఇద్దరి మధ్య మ్యాజికల్ కెమిస్ట్రీని ఈ పాటలో మనం చూడొచ్చు.వివేక్ సాగర్ ఈ పాటకు మంచి స్వరాలు సమకూర్చగా.. చైత్ర - అభయ్ కలిసి పాడారు. లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఈ పాటకి చక్కటి సాహిత్యం అందించారు.

ఈ సినిమాకి పి జి విందా సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా పని చేసారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సహకారంతో బెంచ్ మార్క్ స్టూడియోస్ పతాకంపై ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' సినిమాని రూపొందిస్తున్నారు.ఇక అద్భుతమైన ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా 'ఆ అమ్మాయి..' సినిమాని తెరకెక్కిస్తున్నారు. గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి మహేంద్రబాబు ఇంకా అలాగే కిరణ్ బళ్లపల్లి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక సినిమా సుధీర్ బాబుకి మంచి హిట్టుని ఇస్తుందని ఎంతో నమ్మకంగా వున్నారు. చూడాలి ఇక ఈ సినిమా ఎలాంటి హిట్ ని నమోదు చేస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: