టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హీరోయిన్ లు కొంతమంది హీరోలకు అభిమానులుగా ఉండడం సహజమే. అయితే అందరూ హీరోయిన్లు కూడా పదే పదే ఒకే హీరోను పేరు చెబుతూ ఆయన పట్ల తమ ప్రేమను చూపించడం నిజంగా ఎంతో గ్రేట్ అనే చెప్పాలి. ఇటీవల కాలంలో తెలుగు సినిమా పరిశ్రమలో భారీ స్థాయిలో క్రేజ్ అందుకొని వరుస భారీ చిత్రాలతో ముందుకు దూసుకుపోతున్నాడు హీరో విజయ్ దేవరకొండ. ఆయనకు టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి కాదు బాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి కూడా హీరోయిన్లు అభిమానులుగా ఉంటారు.

 వారు ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా కూడా విజయ్ ప్రస్తావన రావాల్సిందే. ఆయన గురించి ఏదో ఒక రకంగా చెప్పాల్సిందే. తాజాగా సమంత కూడా విజయ్ దేవరకొండ గురించి ఒక షోలో వెల్లడించడం నిజంగా విశేషం అనే చెప్పాలి. ఇంతటి గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ హీరోయిన్ల మనసుల్లో రాజకుమారుడిగా ముద్ర వేసుకున్నాడని చెప్పాలి. ఇటు అభిమానం పరంగా కూడా కోట్ల మంది అభిమానులు ఆయనకు ఉన్నారు. ఇంతటి స్థాయిలో ప్రేక్షకులను ఆయన ఆరాధించడానికి కారణం ఆయన నటనే అని చెప్పాలి. పెళ్లిచూపులు అర్జున్ రెడ్డి గీత గోవిందం డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో ఆయన ప్రేక్షకులను అలరించిన తీరు అమోఘం.

ఇంత తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగిన ఈ విజయ్ దేవరకొండ తప్పకుండా భవిష్యత్తులో దేశంలోనే నెంబర్ వన్ హీరోగా ఎదగడం ఖాయం అని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇకపోతే అయన సినిమా విషయానికొస్తే పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన లైగర్ సినిమా ఆగస్ట్ 25 వ తేదీన విడుదల కాబోతుంది. ఖుషి సినిమా షూటింగ్ శేరావేగంగా జరుగుతుంది. ఇకపోతే పూరీతో కలిసి అయన మరో సినిమా కూడా చేస్తున్నాడు. జనగణమన సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఆ విధంగా విజయ్ దేవరకొండ ఏ స్థాయి లో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి. త్వరలోనే సుకుమార్ సినిమా కు సంబందించిన అప్డేట్ కూడా రాబోతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: