ఇక ఏ స్టార్ హీరోకీ రానంత ఇమేజ్ ఈ రోజు మన తెలుగు యంగ్ హీరోకి వచ్చింది. ఇవాళ బాలీవుడ్‌లో కొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ.బాలీవుడ్ సినిమాలు అయిన అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా , అక్షయ్ కుమార్ రక్షా బంధన్ సుమారు మూడు వేల షోలు ప్రదర్శితం కానుండగా, కార్తికేయ 2 అంతకు మించి ఏకంగా 3130 షోలు ప్రదర్శించనున్నారు.మంచి మంచి సెలెక్టివ్ కథలతో సినిమాలు ఎంచుకుంటున్న నిఖిల్ తాజాగా చేసిన మూవీ కార్తికేయ 2.టాలీవుడ్ సూపర్ హిట్ మూవీ కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పడుతున్నారు. ఇటు సౌత్‌లోనే కాక అటు నార్త్‌లో కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేస్తోంది. యంగ్ డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించి బాగానే మెప్పించింది.


బాలీవుడ్ సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం ఇది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం యూఎస్‌లో కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.హిందీ వెర్షన్‌లో 50 షోలతో ప్రారంభమైన ఈ చిత్రం రోజు రోజుకీ కౌంట్ పెరుగుతూ ప్రస్తుతం ఏకంగా 3130 షోలకు వచ్చింది. విడుదలైన రోజునుంచి అక్కడ ఎంతగానో దుమ్మురేపుతోంది. నిన్నంతా సోషల్ మీడియాలో కార్తికేయ 2 సినిమా ట్రెండింగ్‌ నడిచింది. మూడు రోజుల్లోనే టార్గెట్ కంప్లీట్ చేసుకుని లాభాల బాట పట్టిన సినిమా కార్తికేయ 2. ఏకంగా 50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ ఏడాది క్లీన్ హిట్ అయిన సినిమాల్లో 11వ సినిమాగా ఉంది కార్తికేయ 2.ఇంకా బాగా ప్రదర్శించబడుతూ చాలా నిలకడగా ఎక్కడ తగ్గకుండా రోజుకి కోటిపైగా వసూళ్ళని సాధిస్తుంది కార్తికేయ 2 సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: