బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు ఆయన రన్బీర్ కపూర్ హీరోగా బ్రహ్మాస్త్ర అనే మూవీ తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించగా ,  ఆలియా భట్ ,  అమితా బచ్చన్ , నాగార్జున ,  మౌని రాయ్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ని సెప్టెంబర్ 9 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం మూవీ యూనిట్ వరుస గా  ఈ మూవీ ప్రమోషన్ లను నిర్వహిస్తూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తెలుగు లో కూడా భారీ ఎత్తున విడుదల చేయనున్న నేపథ్యంలో ఈ సినిమా బృందం తెలుగు లో కూడా ఈ మూవీ ప్రమోషన్ లను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ వస్తుంది. ఈ మూవీ ని తెలుగు లో రాజమౌళి సమర్పిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో హైదరాబాద్ నగరం లోని మల్టీప్లెక్స్ లలో బ్రహ్మాస్త్ర హిందీ 3D వర్షన్ టికెట్ బుకింగ్ లను తాజాగా తెరిచారు.

ఇది ఇలా ఉంటే బ్రహ్మాస్త్ర హిందీ 3D వర్షన్ టికెట్ ధరను దాదాపు 35 రూపాయలుగా ఉంది. అలాగే తాజాగా తెరవబడిన బ్రహ్మాస్త్ర  హిందీ 3D వర్షన్ కు ప్రారంభంలో మంచి ఫ్రెండ్ కనబడుతుంది. ఇది ఇలా ఉంటే గత కొంత కాలంగా బాలీవుడ్ మూవీ లు ఏవి కూడా పెద్ద విజయాలను సాధించ లేక పోయాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: