గోవా బ్యూటీ ఇలియానా గురించి పరిచయం అవసరం లేదు.ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరికెక్కిన దేవదాసు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అనంతరం మహేష్ బాబు సరసన పోకిరి సినిమాలో నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో ఈమె ఇండస్ట్రీలో ఊహించని విధంగా వరుస సినిమా అవకాశాలను అందుకొని స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ

మరోవైపు తమిళ సినిమాలలో కూడా అవకాశాలను అందుకొని తెలుగు తమిళ భాషలలో ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నటువంటి ఇలియాన కథల ఎంపిక విషయంలో తడబడ్డారు.ఈ క్రమంలోనే ఈమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ కావడంతో ఈమెకు సినిమా అవకాశాలు కూడా పూర్తిగా తగ్గిపోయాయి. అనంతరం విదేశీ వ్యక్తితో ప్రేమలో పడి కొన్ని రోజులపాటు పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు ఆమె . ఇలా ప్రేమ వ్యవహారంతో ఇండస్ట్రీకి దూరమైన ఈమె తిరిగి ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ తనకు ఏ విధమైనటువంటి అవకాశాలు రాలేదని తెలుస్తుంది.

ఇకపోతే సినిమా అవకాశాలు రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఇలియానాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలియానా గత కొద్ది రోజులుగా ఓ వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారని త్వరలో తనని పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

 

మరి ఇలియానా రిలేషన్ లో ఉన్న వ్యక్తి మరెవరో కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్‌ లారెంట్‌ మిచెల్‌తో ఈమె రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఇప్పటికే వీరిద్దరూ పెళ్లికి సంబంధించిన షాపింగ్ కూడా మొదలుపెట్టారని త్వరలోనే ఈ విషయాన్ని అధికారకంగా తెలియచేయునున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: