ఒక భాషలో సూపర్ హిట్ అందుకున్న సినిమాలు ఇతర భాషలలో రీమిక్స్ చేయడం చాలా సర్వసాధారణంగా మారుతూ ఉంటుంది . ముఖ్యంగా సౌత్ సినిమాలు ఎక్కువగా బాలీవుడ్లో రీమేక్ అవుతూ ఉన్నాయి. మన తెలుగు సినిమాలు చాలావరకు బాలీవుడ్లో రీమేక్ అయి మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అలా పోకిరి, అర్జున్ రెడ్డి, జెర్సీ, రాక్షసుడు తదితర సినిమాలు బాలీవుడ్లో రీమేక్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. కండలు వీరుడు సల్మాన్ ఖాన్ తెలుగు సినిమాల పైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.


ఇక మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాను రీమెక్ చేసి మంచి విజయాన్ని అందుకున్నారు. అలాగే రెడీ వంటి సినిమాలను కూడా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.ఇప్పుడు మరొకసారి తెలుగు చిత్రాన్ని అక్కడ రీమిక్స్ చేయాలని చూస్తున్నారు సల్మాన్ ఖాన్. అలా పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు చిత్రాన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసి విడుదల చేసి మంచి విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. వాస్తవానికి ఇది తెలుగు సినిమా కాదు తమిళ్లో అజిత్ హీరోగా ఈ చిత్రాన్ని నటించారు. ఇద్దరం అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది.


ఈ చిత్రాన్ని తెలుగులో వీరుడు ఒక్కడే అనే టైటిల్ తో డబ్ చేసి విడుదల చేయడం. ఇక ఈ సినిమానీ పవన్ కళ్యాణ్ రీమేక్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని సల్మాన్ ఖాన్ బాలీవుడ్ లో చేస్తున్నాడనే టాక్ బాగా వినిపిస్తోంది. తెలుగులో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిన ఈ చిత్రం బాలీవుడ్ లో ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చిరంజీవితో కలిసి గాడ్ ఫాదర్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటిస్తున్నారు. దీంతో మొదటిసారిగా టాలీవుడ్ లో నటించబోతున్నారు సల్మాన్ ఖాన్. మరి రాబోయే రోజుల్లో సల్మాన్ ఖాన్ తెలుగు చిత్రాలను ఎన్ని రీమేక్ చేసి బాలీవుడ్ లో విడుదల చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: