బాలీవుడ్ నటీనటులు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా "భేడియా". అమర్ కౌశిక్ డైరెక్షన్లో ఇండియాస్ ఫస్ట్ ఎవర్ క్రియేచర్ యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా నవంబర్ 25వ తేదీన హిందీ, తెలుగు ఇంకా అలాగే తమిళ భాషలలో గ్రాండ్ గా విడుదల కాబోతుంది.ఈ నేపథ్యంలో భేడియా సినిమా తెలుగు రైట్స్ ఒక ఫేమస్ టాలీవుడ్ నిర్మాత చేతికి చిక్కినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక ఆయన ఎవరో కాదు గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్. ఈమధ్యనే కన్నడ డబ్బింగ్ "కాంతార" సినిమాను తెలుగులో రిలీజ్ చేసి పెద్ద మొత్తంలో లాభాలను సంపాదించారు. ఇప్పుడు మరోసారి మరో డబ్బింగ్ మూవీని రిలీజ్ చెయ్యడానికి అల్లు అరవింద్  పూనుకోవడంతో ఈ సినిమాపై అందరి దృష్టి ఎక్కువగా పడింది.ఇంకా అంతేకాక భేడియా (తోడేలు) ట్రైలర్ ఇంప్రెసివ్ అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో తెలుగు ప్రేక్షకులు వరుణ్ ధావన్ రాక కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన ఈ హిందీ సినిమా భేడియాని హిందీలో భారీ హిట్స్ అయిన 'స్త్రీ', 'బాలా' సినిమాలకి దర్శకత్వం వహించిన అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. హారర్ కామెడీ సినిమాలు 'స్త్రీ', 'రూహి' తర్వాత దినేష్ విజయన్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై హిందీలో మంచి అంచనాలు ఉన్నాయి. తెలుగులో ఈ సినిమాను తోడేలు మనిషిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది గీతా ఆర్ట్స్. మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో..ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే చాలా ఆసక్తిగా వుందో. అలాగే యూ ట్యూబ్ లో కూడా చాలా పెద్ద హిట్ అయ్యింది.. మరి ఈ సినిమా ఏ విధంగా హిట్ అవుతుందో ఇంకా గత కొంతకాలం నుంచి ప్లాపులతో సతమతం అవుతున్న బాలీవుడ్ ని ఎంతవరకు కాపాడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: