తమిళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న మాస్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగులో కూడా విడుదల చేయగా ... అందులో కొన్ని మూవీ లు తెలుగు లో కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈ హీరోకు తెలుగు నాట కూడా మంచి క్రేజ్ లభించింది. అజిత్ ఆఖరుగా వలిమై అనే మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించాడు.

మూవీ తమిళ్ ... తెలుగు ... కన్నడ ... మలయాళ ... హిందీ భాషలలో విడుదల అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా అజిత్ "తునివు" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యాడు. హెచ్ వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రేజీ మూవీ కి బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించాడు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని జనవరి 10 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నారు. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యొక్క యూఎస్ఏ ప్రీమియర్ బుకింగ్ లు కూడా మొదలు అయ్యాయి.

అందులో భాగంగా ఈ మూవీ కి యూఎస్ఏ ప్రీమియర్స్ లో మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ ని యూఎస్ఏ లో 51 లొకేషన్ లలో ... 108 షో లు వేయనున్నారు. ఇప్పటికే ఈ షో లకు సంబంధించిన బుకింగ్ లు కూడా ప్రారంభం కాగా ... ఈ మూవీ కి సంబంధించిన 533 టికెట్ లు కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి. అందుకు గాను ఈ మూవీ కి 11 కే గ్రాస్ కూడా లభించింది. ఇలా ప్రస్తుతం తునివు మూవీ యూఎస్ఏ యూఎస్ఏ ప్రీమియర్స్ ఫ్రీ సేల్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రేంజ్ అంచనాలు క్రియేట్ అయి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: