హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా మంజు వారియర్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం తునివు. బ్యాంకు మోసాల నేపథ్యంలోని ఈ సినిమా కథ రాసుకున్నాడు. కాస్త అటు ఇటుగా ఇదే కథ ను సర్కారు వారి పాట సినిమాలో మహేష్ బాబుతో చెప్పించాడు దర్శకుడు పరుశురాం. అందులో కూడా బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన బడా వ్యక్తుల గురించి చెప్పుకొచ్చారు.  ఆ భావం కామన్ జనం పై ఎలా పడుతుందనేది అసలు కథ. ఇకపోతే ఇక్కడ క్రెడిట్ కార్డులు,  రుణాలు,  మ్యూచువల్ ఫండ్స్ రూపంలో జనాలు దగ్గర సొమ్ము దోచేసి దాన్ని బ్యాంకులు ఎలా మాయం చేస్తున్నాయని చూపించాడు వినోద్.

కావలసిన కమర్షియల్ హంగులు అద్దాడు హెచ్ వినోద్. ముఖ్యంగా ఫస్టాఫ్ అంతా బాగానే ఉన్నా రెండవ భాగం మాత్రం స్లోగా నడిచింది. ముఖ్యంగా సర్కారు వారి పాట సినిమాను గుర్తుకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది ఈ సినిమా. లాజిక్ లేని కొన్ని సీన్స్ ఇబ్బంది పెడతాయి.. అదొక్కటే సినిమాకు ప్రధానమైన మైనస్. నటీనటుల నటన అజిత నటన గురించి అందరికీ తెలిసిందే కథతో సంబంధం లేకుండా తన పాత్ర వరకు ఇరగదీస్తుంటాడు అజిత్ వల్లే ఈ సినిమాలో చూడొచ్చు అనేలా నటించాడు అని చెప్పవచ్చు. ముఖ్యంగా మంజు వారియర్ స్క్రీన్ ప్రజెంట్ చాలా అద్భుతంగా ఉంది. ఆమెకు 44 సంవత్సరాలు అంటే నమ్మడం అసాధ్యం.

మరో కీలక పాత్రలో తెలుగు నటుడు అజయ్ కూడా బాగా నటించాడు.  అలాగే సముద్రఖని కూడా తనదైన శైలిలో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. వినోద్ కథకుడిగా బాగానే ఉన్న దర్శకుడిగా మాత్రం సగం మార్కులే వేయించుకున్నాడు. ఇకపోతే ఈయన చేసిన వలిమై కంటే ఇది కాస్త స్లోగా అనిపించింది.  యాక్షన్ సీక్వెన్స్ లు బాగున్నాయి కానీ ఇతర సినిమాను గుర్తుకు తెచ్చే విధంగా ఉండడంతో నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: