మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమా సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. జనవరి 13న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఆనంతరం మెగాస్టార్ చిరంజీవి మెహర్ రమేష్ కలయికలో భోళాశంకర్ సినిమా రానంది.అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. తాజాగా భోళాశంకర్ సినిమా రిలీజ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వైరల్ అవుతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఇందులో భాగంగానే ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారట.

తాజాగా అంచుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాని 2024 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయాలని డేట్ ని ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బడా సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన సినిమాని సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ డేట్ కె ఈ సినిమాని విడుదల చేయడానికి ఒక ముఖ్య కారణం ఉందని తెలుస్తోంది. సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే.

కేవలం సంక్రాంతికి విడుదల కావడంవల్ల ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకుంది అని అందుకే మెహర్ రమేష్ మరియు మెగాస్టార్ కాంబినేషన్లో రానున్న భూలా శంకర్ సినిమా కూడా సంక్రాంతికి విడుదల చేస్తే ఈ సినిమాలాగే మంచి విజయాన్ని అందుకుంటుంది అన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని తెలుస్తోంది.ఇక ఆ షేడ్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని కూడా అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ తో పాటు భారీ యాక్షన్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.ఈ సినిమా కూడా వాల్తేరు వీరయ్య సినిమా అంతటి విజయాన్ని అందుకుంటుందా లేదా చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: