నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస మూవీ లలో హీరోగా నటిస్తూనే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షో మొదటి సీజన్ అదిరిపోయే రేంజ్ సక్సెస్ ను సాధించడంతో ఆహా యూనిట్ ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ను ప్రస్తుతం కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ రెండవ సీజన్ లో భాగంగా మొదటి ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ లు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గోపీచంద్ లు ఈ 2 వ సీజన్ లో మరొక ఎపిసోడ్ కు గెస్ట్ లుగా విచ్చేశారు. ఈ ఎపిసోడ్ కు కుడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభించింది. అలాగే మరికొన్ని ఎపిసోడ్ లు కూడా సీజన్ 2 లో ప్రసారం కాక వాటికి కూడా మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుండి లభించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ టాక్ షో కు పవన్ కళ్యాణ్ విచ్చేశాడు. మరికొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఎపిసోడ్ ను కూడా ఆహా నిర్వాహ బృందం టెలికాస్ట్ చేయబోతుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తమిళ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి సూర్య మరియు కార్తీ లు ఈ  టాక్ షో లోని ఒక ఎపిసోడ్ కి గెస్ట్ లుగా రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటివరకు ఈ వార్తకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన వెలబడలేదు. ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తాజాగా వీర సింహా రెడ్డి మూవీ లో హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: