టాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి నిఖిల్ తాజాగా 18 పేజెస్ అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అనుపమ పరమేశ్వర నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించగా గోపి సుందర్మూవీ కి సంగీతం అందించాడు.

మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేసి పరవాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ ఈ రోజు నుండి అనగా జనవరి 27 వ తేదీ నుండి రెండు ప్రముఖ "ఓ  టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ఆహా మరియు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లు దక్కించుకున్నాయి.

ఈ రెండు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లు ఈ రోజు నుండి ఈ సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నాయి. మరి థియేటర్ లలో ప్రేక్షకుల నుండి పరవాలేదు అని రెస్పాన్స్ ను తెచ్చుకున్న ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ఈ రోజు నుండి ఈ సినిమా ఆహా మరియు నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: