
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల లైనప్ విషయంలో కూడ త్రివిక్రమ్ సలహాలు సూచనలు చాల కీలక పాత్రను పోషిస్తున్నాయి. తమిళంలో హిట్ కావడమే కాకుండా మంచి సినిమాగా విమర్శకుల ప్రశంసలు పొందిన ‘వినోదియ సిత్తం’ మూవీని పవన్ తో తీయాలని సముద్రఖని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాడు. అయితే పవన్ కు ఈ మూవీ చేయాలని ఆశక్తి ఉన్నప్పటికీ రాజకీయాల నేపధ్యంలో ఈ మూవీకి డేట్స్ ఇవ్వలేకపోతున్నాడు అన్నవార్తలు వచ్చాయి.
అయితే ఇప్పుడు త్రివిక్రమ్ తన తెలివి తేటలతో ఈసమస్యకు ఈ పరిష్కారం కనిపెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈమూవీకి సంబంధించి పవన్ కేవలం 15 రోజులు డేట్స్ ఇస్తే చాలు మిగతా సినిమా వ్యవహారాలను తాను నడిపిస్తాను అని త్రివిక్రమ్ బరోసా ఇవ్వడంతో ఇప్పుడు పవన్ ఈ మూవీని ఫిబ్రవరి నుండి సెట్స్ పైకి తీసుకు రావడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ భావజాలానికి చాల దగ్గరగా ఉండే ఈమూవీలోని పాత్రలో పవన్ వర్తమానంలో జరగబోయే విషయాలను గ్రహించే ఒక అద్భుతమైన శక్తిగల పాత్రలో కనిపిస్తాడని ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరొక షాకింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఏమీ జరుపుకోకుండా నేరుగా ఈ మూవీని సెట్స్ పైకి తీసుకువెళ్ళి ముందుగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ లపై చిత్రీకరించవలసిన కీలక సన్నివేశాలు పూర్తి చేసి ఆతరువాత ఈ మూవీ మిగతా షూటింగ్ ను కొనసాగిస్తారని టాక్..