
గత కొన్ని సంవత్సరాల క్రితం బిచ్చగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈయన ఇప్పుడు అదే సినిమా పిచ్చైకారి 2 సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యారు. ఈ క్రమంలోనే విదేశాలలో ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్తి చేయాలని అక్కడికి వెళ్ళగా షూటింగ్లో భాగంగా విజయ్ ఆంటోనీ ఉన్న షిప్ ను మరొక షిప్పు ఢీకొనగా అక్కడికక్కడే ఆయనకు ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. ముఖానికి గాయాలు తగిలినట్లు దవ్వడం పళ్ళు విరిగినట్లు , దవడ ఎముక కూడా విరిగినట్లు సమాచారం అంతేకాదు నడవలేని పరిస్థితిలో ఉన్నారంటూ వార్తలు బాగా వైరల్ అయ్యాయి.
ఆయన కోలుకున్నారని.. వదంతులు నమ్మవద్దు అని.. ఆయన చెన్నైలో క్షేమంగానే ఉన్నారు అంటూ కూడా వార్తలు వినిపించాయి కానీ తాజాగా వినిపిస్తున్న ప్రతి సమాచారం ప్రకారం విజయ్ ఆంటోని నడవలేని పరిస్థితిలో ఉండడం వల్లే ఆయనను అమెరికాకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మెరుగైన చికిత్స కోసం విజయ్ ఆంటోనీని అమెరికాకు తీసుకెళ్లబోతున్నట్లు సమాచారం. మొత్తానికైతే విజయ్ ఆంటోని మెరుగైన చికిత్సను పొంది త్వరగా తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు అంతేకాదు బిచ్చగాడు 2 కోసమైనా ఆయన తిరిగి రావాలని మరికొంతమంది చెబుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీలు కూడా కోరుకుంటున్నారు.