తెలుగు చలనచిత్ర పరిశ్రమలో డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. అంతకుమించి పాత్రలతో నటీనటులకు గుర్తింపు ఇవ్వడం ఆయన ప్రత్యేకత.. అందుకే సుకుమార్ సినిమాలలో నటించారు అంటే తప్పకుండా వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ క్రమంలోనే పుష్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈయన.. తన సినిమాకు బాలీవుడ్ లో ఎటువంటి ప్రచారాలు చేయకుండానే రూ.100 కోట్ల మార్కు దాటేసి సంచలనం సృష్టించాడు.

ఇప్పుడు పుష్ప 2 సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో నార్త్ ఆడియన్స్ ను సుకుమార్ టార్గెట్ చేస్తున్నట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే పుష్ప సినిమాను బాలీవుడ్ లో ప్రచారం చేయకుండానే 100 కోట్ల మార్కు దాటిందంటే ఒకవేళ ప్రచార కార్యక్రమాలు చేపడితే ఈ సినిమా మరో బాహుబలి స్థాయిలో రికార్డులు సాధిస్తుందని ఆలోచనలో.. ఆయన నార్త్ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఏదైనా ఒక స్టార్ హీరో సినిమా తెరకెక్కుతోంది అంటే పాన్ ఇండియా రేంజ్ లో ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ను మెప్పించగలిగితే ఆ సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోని సుకుమార్ కూడా ఇదే విధంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే షారుక్ నటించిన పఠాన్ సినిమా అటు నార్త్ ఇటు సౌత్ ఆడియన్స్ ను  బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.  కానీ బాహుబలి రేంజ్ లో మాత్రం రికార్డులను కొల్లగొట్టలేక పోతోంది. ఈ క్రమంలోనే సుకుమార్ ఈసారి బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తూ పుష్ప 2 సినిమాతో మరో సంచలనం క్రియేట్ చేయడానికి ఇప్పుడు నార్త్ ఆడియన్స్ వైపు ముగ్గు చూపుతున్నట్లు సమాచారం.  మరి సుకుమార్ ఆలోచన మేరకు పుష్ప 2 సినిమాను నార్త్ లో కూడా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తే తప్పకుండా ఈ సినిమా మరో ఫీట్ అందుకుంటుంది అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: