లెజెండరీ ప్రొడ్యూసర్ దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు వెంకటేష్. అయితే వెంకటేష్ ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను అలరించినప్పటికీ ఇక అతని కెరియర్ను మలుపు తిప్పింది   మాత్రం చంటి సినిమానే అని చెప్పాలి.  ఇక ఈ సినిమాలో వెంకటేష్ లో ఉన్న సరికొత్త నటుడుని ప్రేక్షకులకు పరిచయం చేసుకునే అవకాశం దక్కింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో పిల్లలతో పాటు మహిళా ప్రేక్షకుల్లో కూడా తిరుగులేని ఫాలోయింగ్ సంపాదించాడు వెంకటేష్.


 ఇక ఈ సినిమాలో వెంకటేష్ అమాయకమైన నటనతో అందరిని మెస్మలైజ్ చేసాడు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే వెంకటేష్ చంటి సినిమా అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా మారింది. ఏకంగా 200 రోజులకు పైగా ఆడి వెంకటేష్ కెరియర్ను మలుపు తెప్పింది. అయితే వెంకటేష్ కెరియర్లో  బిగ్గెస్ట్ హిట్ గా ఉన్న చంటి సినిమా ఏకంగా వెంకటేష్ తో మరో హీరోకి మాటలు లేకుండా చేసిందట. ముందుగా తమిళంలో హిట్ అయిన తంబి సినిమా తెలుగు రీమేక్ రైట్స్ ని నిర్మాత కె ఎస్ రామారావు కొనుగోలు చేశారు. రాజేంద్రప్రసాద్ ను హీరోగా పెట్టి తీయాలనుకున్నారు.


 రాజేంద్రప్రసాద్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పారు. ఇక కానీ ఆ తర్వాత ఈ సినిమాను రామానాయుడు చూడటం.. ఆయనకు ఈ సినిమా బాగా నచ్చడం జరిగింది. దీంతో వెంకటేష్ తో ఈ సినిమా తీస్తే అతని కెరియర్ మలుపు తిరుగుతుందని అనుకున్నారు రామానాయుడు. ఇక తర్వాత అప్పటికే కేఎస్ రామారావు ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ కొన్నారు అన్న విషయం తెలుసుకుని ఇక వెంకటేష్ తో సినిమా తీయాలని ఆయనతో చర్చలు జరిపారట.  దీంతో కేఎస్ రామారావు కాదనలేక రాజేంద్రప్రసాద్ను పక్కకు పెట్టి ఇక వెంకటేష్ తో సినిమా తీశారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ హర్ట్ అయ్యాడట. ఇక  బ్యాక్ గ్రౌండ్తో తనకు రావాల్సిన సినిమా వెంకటేష్ కొట్టేసాడని ఇక వెంకటేష్ తో పూర్తిగా మాటలు కూడా మానేసాడట రాజేంద్రప్రసాద్. కానీ కొన్నాళ్ళకి వీళ్ళు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: