ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ నిర్మాతల్లో ఒకరిగా కొనసాగుతున్నారు ప్రముఖ నిర్మాత దిల్ రాజ్. గత ఇరవై సంవత్సరాలు గా  టాలీవుడ్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీ లను నిర్మించారు దిల్ రాజ్.

ఆయన చిన్న హీరోల దగ్గర నుండి స్టార్ హీరోల వరకు అందరు ఆయనతో పని చేస్తారు. చిత్ర పరిశ్రమల్లో దిల్ రాజ్ కి ఫుల్ క్రేజ్ ఉంది. దీంతోనే దిల్ రాజ్ కోలీవుడ్ మరియు బాలీవుడ్ మూవీ లను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఆయన తమిళ హీరో విజయ్ తో ‘ వారీసు ‘ అనే మూవీ తో సూపర్ హిట్ ను కూడా అందుకున్నాడు. ఈ మూవీ ని తెలుగులో వారసుడు అనే పేరుతో విడుదల చేసి బ్లాక్ బస్టర్ హిట్ను అంది పుచ్చుకున్నారు.

దిల్ రాజ్ కు కేవలం ఒక్క నిర్మాణ రంగంలోనే కాదు డిస్ట్రిబ్యూటర్ గా కూడా తన స్థాయి ఏంటో నిరూపించుకున్నారు. ఒక మంచి కాంబో తో మూవీ ట్రైలర్, టీజర్ బాగున్నాయంటే ఆ చిత్రం రైట్స్ ని కొని రిలీజ్ చేస్తాడు దిల్ రాజ్. అలా తెలుగు మూవీ లతో పాటు బోలెడన్ని డబ్బింగ్ మూవీ లను కూడా కొన్నాడు. వాటిల్లో ఒకటే లవ్ టుడే మూవీ . ఈ మూవీ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మన అందరికీ తెలిసినా సంగతే. లో బడ్జెట్ తో తీసిన ఈ సినిమా సుమారుగా ఏడు కోట్ల రూపాయల దాకా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్లను రాబట్టింది. ఇక ఈ మూవీ లో హీరోయిన్ గా ఇవానా చేసింది.దీని వల్ల ఆమెకు తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది.

ఐతే జనాల యొక్క పల్స్ క్యాచ్ చేయడంలో దిల్ రాజుకు సూపర్టాలెంట్ ఉంది. దీంతో ఈ అమ్మాయి కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి తన నెక్స్ట్ మూవీస్ లలో  బుక్ చేసుకున్నాడు. ఆమెకు కేవలం అడ్వాన్స్ రూపంలోనే ఆమెకు పదికోట్ల రూపాయలు  ఇచ్చాడట. ఎప్పుడు డేట్స్ అడిగితే అప్పుడు ఇచ్చేయాలి అని, అలా నాలుగైదు సినిమాలకు సరిపడా అడ్వాన్స్ ఇచ్చి ఆ హీరోయిన్ లాక్ చేసుకున్నాడు దిల్ రాజ్. అయితే సదరు హీరోయిన్ ను మళ్ళీ తమ మూవీ లోకి తీసుకోవడానికి ఆలోచించే నిర్మాతలు, లవ్ టుడే మూవీ హీరోయిన్ కోసం దిల్ రాజ్ ఈ రేంజ్ లో అడ్వాన్స్ ఇచ్చి రిస్క్ చేస్తున్నాడు అని విశ్వాసనియా వర్గాల నుండి అందుతున్న సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: