టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కాజల్ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా నటించి ఎన్నో సంవత్సరాల పాటు అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.

అలాగే ఈ ముద్దుగుమ్మ పాలు బాలీవుడ్ మూవీ లలో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను కూడా అలరించింది. ఇది ఇలా ఉంటే కాజల్ కొంత కాలం క్రితమే పెళ్లి చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా ఈ ముద్దు గుమ్మ సినిమాల్లో నటించింది. అలాగే కొంత కాలం క్రితమే కాజల్ ఒక బిడ్డకు జన్మను ఇచ్చింది. బిడ్డకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా కాజల్ వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ  అదిరిపోయే జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తుంది. అందులో భాగంగా కాజల్ ప్రస్తుతం నటిస్తున్న మూవీ లు ఏవో తెలుసుకుందా.

కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ లో కాజల్ ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ తో పాటు బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో కాజల్  హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల భారీ అంచనాలను నెలకొని ఉన్నాయి. వీటితో పాటు కాజల్ ప్రస్తుతం ఘోస్టీ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ మార్చ్ 17 వ తేదీన విడుదల కాబోతోంది. ఈ మూవీ లతో పాటు ఉమా అనే హిందీ మూవీ లో కూడా కాజల్ నటిస్తోంది. ఇలా ప్రస్తుతం వరుస మూవీ లతో కాజల్ అదిరిపోయే రేంజ్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: