ప్రతి వారం లాగానే ఈ వారం కూడా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేయడానికి రెండు క్రేజీ మూవీ లు రెడీ గా ఉన్నాయి. ఆ మూవీ లు ఏవి ... అవి ఏ తేదీన విడుదల చేయబోతున్నాయో వాటి వివరాలను తెలుసుకుందాం.

ఏజెంట్ : టాలీవుడ్ యువ హీరో అక్కినేని అఖిల్ హీరో గా నటించిన ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా ...  స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డిమూవీ కి దర్శకత్వం వహించాడు. మలయాళ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి మమ్ముట్టిమూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... ఏ కే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ మూవీ ని నిర్మించాడు. హిప్ హాప్ తమేజ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తోంది.

పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 :  మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ లో చియాన్ విక్రమ్ ... జయం రవి ... కార్తీ ... ఐశ్వర్యా రాయ్ ... త్రిష ... శోభితా ధూళిపాల ప్రధాన పాత్రలలో నటించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఇప్పటికే ఈ మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ మూవీ రెండవ భాగంపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని ఏప్రిల్ 28 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: