రీసెంట్ గా ప్రమోషన్స్‌తోనే మంచి హైప్ తెచ్చుకున్న చిన్న సినిమా ఏదైనా ఉందా అంటే అది ఖచ్చితంగా మేం ఫేమస్ మాత్రమే. దీని కోసం కొందరు టాలీవుడ్ స్టార్స్  కదిలొచ్చారు. ఇంకా వీడియోలు చేసారు.ఇదంతా ఒక ఎత్తయితే మహేష్ బాబు లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ కూడా ఈ సినిమా అద్భుతం అంటూ స్పందించడం మరో ఎత్తు.దాంతో ఈ సినిమాకి విపరీతమైన పబ్లిసిటీ వచ్చింది. ఇక నేడు విడుదల అయిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..యూత్‌ను తక్కువ అంచనా వేయొద్దు.. వాళ్లలో చాలా టాలెంట్ చాలా ఉంటుంది.. కాకపోతే బయటికి రావాల్సినపుడే అది వస్తుంది అనేది హీరో కం డైరెక్టర్ సుమంత్ ప్రభాస్ చెప్పాలనుకున్న కథ. దానికోసం పూర్తిగా యూత్ ఫుల్ నెరేషన్‌పైనే ఫోకస్ చేసారు సుమంత్ ప్రభాస్. ఈ సినిమా మొదలవ్వడమే ఫన్ మోడ్‌లో స్టార్ట్ అవుతుంది. ఎక్కడా  సీరియస్ నెస్ అయితే కనిపించదు. సినిమా సరదాగా అలా వెళ్లిపోతుందంతే. మొదటి 45 నిమిషాలు తినడం.. ఊరిమీద బలాదూర్ తిరగడం ఇంకా ఏదో ఓ తింగరి పని చేసి అందరితో చివాట్లు తినడం ఇదే సాగుతుంది.


ఇంటర్వెల్ తరువాత రొటీన్ అయిన నవ్వు తెప్పించే సీన్లు ఉంటాయి. మొత్తానికి సరదాగా తీసాడు. మధ్యలో వచ్చే సన్నివేశాలు అప్పుడప్పుడూ వచ్చే ఎమోషనల్ సీన్స్  అన్నీ సరదాగానే రాసుకున్నాడు సుమంత్. అయితే ఇలాంటి మూవీలకు కామెడీనే ప్రధాన బలం. అక్కడక్కడ మెరుపులు తప్పితే జాతి రత్నాలు రేంజిలో నవ్వించడంతో సుమంత్ ప్రభాస్ విఫలమయ్యాడు.ఇక సుమంత్ ప్రభాస్ అదరగొట్టాడు. స్క్రీన్ మీద ఎనర్జీ నెక్ట్స్ లెవల్ సూపర్. పైగా తన స్క్రిప్ట్ కావడంతో ఇంకా బాగా రెచ్చిపోయాడు. ఇక మై పాత్రకు ప్రాణం పోసాడు. మనోడి కామెడీ టైమింగ్ బాగుంది. అలాగే మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా చాలా బాగా నటించారు.చాలా న్యాచురల్‌గా కనిపించారు. హీరో మరదలి పాత్రలో సార్య లక్ష్మణ్ ఇంకా బబ్బీగా సిరా రాశీ బాగున్నారు. మరో కీలక పాత్రల్లో మురళీధర్‌గౌడ్‌, అంజిమామ, నరేంద్రరవి బాగా ఆకట్టుకున్నారు.సంగీతం బాగుంది. కొంచెం క్వాలిటీ ఉంటే ఇంకా బాగుండేది.ఓవరాల్ గా సినిమా ఎంటర్టైన్మెంట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: