వస్తువులను తయారు చేసే కర్మాగారాలను చూసాం, కానీ హీరోలను తయారు చేసే కర్మాగారామ్ గురించి ఎవరికైనా తెలుసా అతడే నటుడు ప్రయోక్త సత్యానంద్. కర్మాగారం లాంటి సత్యానంద్ నుండి పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజా, ప్రభాస్, శర్వానంద్, వేణు, ఆది పినిశెట్టి, సాయి ధర్మ తేజ్, వరుణ్ తేజ్ ఇలా పవర్ స్టార్లను, రెబల్ స్టార్లను, సూపర్ స్టార్లను తయారు చేసిన ఒకే ఒక వ్యక్తి సత్యానంద్. నేషనల్ స్కూల్ అఫ్ ఆర్ట్స్ డ్రామాలో లెక్చరర్ గా పనిచేస్తున్న సత్యానంద్ ప్రతిభను గుర్తించి మెగా స్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ ను, సూపర్ కృష్ణ తన కుమారుడు మహేష్ ను, నటన వాచకంలకు సంబందించి సత్యానంద్ దగ్గరకు శిక్షణకు పంపించడంతో ఇతడి ఖ్యాతి టాలీవుడ్ అంతా వ్యాపించింది.

ఈయన దగ్గర నటన నేర్చుకున్నవారంతా సేలిబ్రేటీలు కావడంతో ఈయన స్టార్ మేకర్ గా ఎదిగిపోయి ఆయన చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి తానే విశాఖపట్నంలో ఒక ఫిలిం ఇన్స్టిట్యూట్ పెట్టె స్థాయికి తీసుకు వెళ్ళింది. అనేక నాటకాలు నటించడమే కాకుండా జంజ్యాల, చాట్ల శ్రీరాములు, జే.వి. రమణ మూర్తి వంటి ప్రముఖల శిష్యుడిగా మార్చిన కృషి ఈయన సొంతం.

advertisements - Call 040 4260 1008

పెద్దపెద్ద హీరోల కుమారులను బొంబాయి కో, లండన్ కో పంపించకుండా సత్యానంద్ దగ్గరకే పంపడం చూస్తే ఆయన గొప్పతనం అర్ధమ్మవుతుంది. ఎంతోమంది హీరోలను తయారు చేసిన ఈయన ప్రస్తుతం ‘బిల్లా రంగా’ అనే సినిమాలో క్రిష్ణయ్య మాస్టారు అనే గాంధీయ వాది పాత్ర పోషించడం విశేషం.... 

మరింత సమాచారం తెలుసుకోండి: