మెగాస్టార్ చిరంజీవి హీరోగా వరుస సక్సెస్ ల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక సినిమా ఆచార్య. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఎంతో భారీ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగాస్టార్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని, తిరు ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. మంచి మెసేజ్ తో కూడిన ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు ముఖ్యంగా మెగాస్టార్ ఫ్యాన్స్ ని ఆకట్టుకునే విధంగా దర్శకుడు కొరటాల శివ తీస్తున్నాడని, తప్పకుండా ఈ సినిమా మంచి సక్సెస్ సాదిస్తుందని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తునంట్లు తెలుస్తోంది.
ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. మెగాస్టార్ ఒక పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు ప్రచారం అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో మెగాస్టార్ ఒక మాజీ నక్సలైట్ గా నటిస్తుండగా రామ్ చరణ్ ఒక విద్యార్థి నాయకుడిగా నటిస్తున్నట్లు సమాచారం.

ఇకపోతే ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ దసరా తరువాత ప్రారంభం కాబోతుండగా ఈ షెడ్యూల్ లోనే మెగా పవర్ స్టార్ రాంచరణ్ జాయిన్ కానున్నారని అంటున్నారు. కాగా ఈ వార్త ప్రస్తుతం పలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న చరణ్, ఈ సినిమా కోసం ప్రత్యేకంగా కొద్దిరోజులు కాల్షీట్స్ కేటాయించారట. ఇక ఈ సినిమాని వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట యూనిట్....!!

మరింత సమాచారం తెలుసుకోండి: