టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్న కళ్యాణ్ రామ్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీ లో అతనొక్కడే , హరేరామ్ , పటాస్ ,  118 వంటి పలు విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని టాలీవుడ్ ఇండస్ట్రీలో  ఏర్పరుచుకున్నాడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ ఆకారుగా ఎంత మంచి వాడవురా మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా కళ్యాణ్ రామ్ 'బింబిసార' మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కళ్యాణ్ రామ్ సరసన కేథరీన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా నటిస్తుండగా , మల్లాడి వశిష్ట్ ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తాడు. ఈ సినిమాను ఆగస్టు 5 వ తేదీన విడుదల చేయనున్నారు.

సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా ఈ చిత్ర బృందం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. 24 గంటల్లో ఈ మూవీ ట్రైలర్ 9.78 మిలియన్ వ్యూస్ ను , 299.7 కే లైక్ లను సాధించింది. ఓవరాల్ గా చూసుకుంటే బింబిసార మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది అని చెప్పవచ్చు. మరి ఈ సినిమాతో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: