
అయితే ఇప్పటికే ఈ సినిమా కోసం బాలీవుడ్ బ్యూటీని ఎన్టీఆర్ కోసం సెలెక్ట్ చేశారని.. కానీ ఇక ప్రొడ్యూసర్లు హీరోయిన్ ఎంపిక గురించి అఫీషియల్ ప్రకటన చేసేందుకు మాత్రం ఇష్టపడటం లేదు అన్న టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. అయితే ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ సరసన ఒక హీరోయిన్ నటిస్తే చూడాలని ఉంది అంటూ ఎంతోమంది నందమూరి అభిమానులు కోరుకుంటున్నారట. ఆ హీరోయిన్ ఎవరో కాదు ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యంగ్ సెన్సేషన్ గా కొనసాగుతున్న శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీలీలా ఇక ఇప్పుడు వరుసగా స్టార్ హీరోల సినిమాలో ఛాన్స్ కొట్టేస్తుంది.
ఈ క్రమంలోనే సినిమాల్లో ఎంతో చలాకీగా కనిపించే శ్రీలీలా అటు తారక్ సరసన నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారట. అయితే శ్రీ లీలా మంచి డాన్సర్ అన్న విషయం తెలిసిందే. ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే ప్రేక్షకులకు పూనకాలే అనే అభిమానులు అనుకుంటున్నారట. ఒకవేళ కొరటాల శివ సినిమాలో సెకండ్ సెకండ్ హీరోయిన్ పాత్రకు ఛాన్స్ ఉంటే ఆ రోల్ కోసం శ్రీలీలను ఎంపిక చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ సినిమా ఛాన్స్ వస్తే శ్రీ లీలా ఎలాగో నో చెప్పే ఛాన్స్ ఉండదు కాబట్టి.. ఇక అంతా దర్శకులు చేతుల్లోనే ఉంటుందని భావిస్తున్నారట ఫాన్స్.