డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్లు 2019లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో చెప్పాల్సిన పనిలేదు. ఒక్కసారిగా పూరి కెరియర్ను రామ్ కెరియర్ను మార్చే వేసిందని చెప్పవచ్చు. ఇందులో హీరో రామ్ సిక్స్ ప్యాక్ చేసి మాస్ లుక్ లో అదరగొట్టేశారు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత లైగర్ సినిమాని చేయగా అది ఘోరమైన డిజాస్టర్ మూటకట్టుకోవడంతో మళ్ళీ పూరి కెరియర్ అయోమయంలో పడింది. ఇప్పుడు మళ్లీ ఏడాదిలోపే మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యారు.


ఈసారి రామ్ పోతినేని తో కలిసి డబ్బులు ఇస్మార్ట్ శంకర్ అనే సినిమాని వచ్చే ఏడాది మార్చి 8న విడుదల చేయబోతున్నట్లు ముందుగానే అనౌన్స్మెంట్ చేశారు. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ కూడా మొదలు పెట్టేశారు పూరి జగన్నాథ్.. పది రెడ్బుల్స్ తాగిన ఎనర్జీని ఒక సినిమాతో ఇవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాను ఈ కాంబినేషన్ ఈసారి అదిరిపోద్ది అంటూ ఫారెన్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుని వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఒక ట్విట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఆ తర్వాత ముంబై షెడ్యూల్ ని కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది పూరి.


ఒక షెడ్యూల్లో సాంగ్తోపాటు సినిమా షూటింగ్ జరిగిందని తెలుస్తుంది ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత రెండు మూడు నెలల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను కూడా పూర్తి చేయాలని ఇలాంటి పరిస్థితుల్లోనైనా సరే మార్చి 8న చెప్పిన డేట్ కి డబుల్ ఇస్మార్ట్ శంకర్ ను విడుదల చేయాలని చూస్తున్నారు చిత్ర బృందం. ఇక పూరి జగన్నాథ్ రామ్ పోతినేని ,సంజయ్ దత్తుకు సంబంధించి ఒక ఫోటో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫోటోలో స్టైల్ ఆఫ్ కాస్ట్యూమ్ లో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: