తమిళ , తెలుగు సినీ పరిశ్రమలలో నటి గా తనకంటూ మంచి గుర్తింపును సంపాదించు కున్న వారిలో ఐశ్వర్య రాజేష్ ఒకరు . తమిళ్ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత కౌసల్య కృష్ణమూర్తి అనే మూవీ తో ఈమె తెలుగు తేరకు పరిచయం అయ్యింది . మహిళ క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలం అయింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టినప్పటికీ ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆ తర్వాత పలు తెలుగు సినిమాలలో ఈ బ్యూటీ కి అవకాశాలు దక్కాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతుంది. ఇలా సినిమాలతో ... వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. 

అందులో భాగంగా చాలా సార్లు ఈమెకు సంబంధించిన అనేక హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. తాజాగా కూడా ఐశ్వర్య రాజేష్ తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఇందులో ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉంది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ నటి చేతిలో అనేక సినిమాలు ... మరియు కొన్ని వెబ్ సీరీస్ లు కూడా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: