మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) మూవీ ఈ నెల 28న పాన్ ఇండియా లెవెల్ లో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే.మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేస్తోండగా తాజాగా “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది. ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షోను పలువురు టాలీవుడ్ డైరెక్టర్స్ చూసి చాలా అద్భుతమైన సినిమా చూశామంటూ ప్రశంసించారు. ఈ సెలబ్రిటీ ప్రీమియర్ షోకి హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, హాలీవుడ్ నటుడు జిమ్మీ జీన్ లూయిస్, నిర్మాత వై రవిశంకర్, నవీన్ యెర్నేని, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి, దర్శకులు హను రాఘవపూడి, అజయ్ భూపతి, శివ నిర్వాణ, పి.మహేశ్ బాబు, ప్రవీణ్ సత్తారు, శ్రీను వైట్ల, కిషోర్ తిరుమల ఇంకా చంద్రసిద్ధార్థ్ హాజరయ్యారు.


జీవితంలో కేవలం ఒక్క సారే ఇలాంటి గొప్ప సినిమా చేసే అవకాశం వస్తుందని, ఈ సినిమాకు అన్ని అవార్డ్స్ దక్కుతాయని సెలబ్రిటీలు “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా మీద ప్రశంసలు కురిపించారని మూవీ యూనిట్ వెల్లడించారు. ఇది ఒక బెస్ట్ సర్వైవల్ మూవీ అని, ఒక క్లాసిక్ గా మిగిలిపోతుందని సినిమా చూసిన డైరెక్టర్స్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాకు మూవీ టీమ్ పెట్టిన ఎఫర్ట్ కు హ్యాట్సాప్ చెబుతూ కొన్ని ఏళ్లపాటు ఒక క్యారెక్టర్ తో ట్రావెల్ అవడం సాధారణ విషయం కాదని హీరోని ఎంతగానో అభినందించారు. “ది గోట్ లైఫ్” (ఆడు జీవితం) సినిమా బెన్యామిన్ రాసిన గోట్ డేస్ నవల ఆధారంగా అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించడం జరిగింది. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాని మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ మూవీని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.హనుమాన్ వల్ల వచ్చిన ప్రాఫిట్స్ తో మైత్రి వాళ్ళు ఈ మూవీని ఇంకా మంజుమ్మేల్ బాయ్స్ ని చాలా గ్రాండ్ గా తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు.మరి చూడాలి ఈ సినిమా ఎలాంటి లాభాలు తెస్తుందో..

మరింత సమాచారం తెలుసుకోండి: