తెలుగు లో ఫుల్ క్రేజ్ కలిగిన యువ నటిమనులలో శ్రీ లీల ఒకరు. శ్రీకాంత్ కుమారుడు అయినటువంటి రోషన్ హీరో గా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకున్నప్పటికీ ఇందులో ఈ నటి తన నటనతో , అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఆ తర్వాత నుండి ఈమెకు వరసగా తెలుగు సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు అనేక సినిమాలలో నటించిన శ్రీ లీల తన క్రేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో మరింత గా పెంచుకుంది.

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఆఖరుగా ఈ నటి ఈ సంవత్సరం సంక్రాంతి పండగ కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయినటువంటి గుంటూరు కారం అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. మహేష్ బాబు హీరో గా రూపొందిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి.

ఇప్పటి వరకు శ్రీ లీల అనేక తెలుగు , కన్నడ సినిమాలలో నటించింది. కాకపోతే తమిళ సినిమాలో మాత్రం నటించలేదు. కానీ తాజాగా తమిళ సినిమాలలో నటించాలని ఉన్నట్లు వెల్లడించింది. ఈ ముద్దు గుమ్మ తాజాగా చెన్నై లో జరిగిన ఓ కాలేజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వెళ్ళింది. ఆ ఈవెంట్ లో భాగంగా ఈమెకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. దానితో శ్రీల నేను చెన్నై లో ఎవరికి తెలియను అనుకున్నాను. నాకు ఇంత క్రేజ్ తమిళ నాడు లో ఉంది అని నాకు ఇప్పుడే అర్థం అయింది. ఇక పై నేను తమిళ సినిమాలు కూడా చేస్తాను అని ఈవెంట్ లో భాగంగా శ్రీ లీల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: