చాలా సినిమాలకు డైరెక్టర్ సుకుమార్ దగ్గర పని చేసి ఆ తర్వాత ఉప్పెన మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టిన బుచ్చిబాబు సన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన దర్శకత్వం వహించిన మొదటి సినిమా ఉప్పెన అద్భుతమైన విజయం సాధించడం అలాగే ఆ మూవీ ని తెరకెక్కించిన విధానానికి బుచ్చిబాబు కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి ఈయనకు మంచి ప్రశంసలు రావడంతో మొదటి సినిమాతోనే బుచ్చిబాబు తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు గా మారిపోయాడు.

ఇక ఆ తర్వాత ఈయన ఎన్టీఆర్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కాకపోతే ఈయన తన తదుపరి సినిమాను రామ్ చరణ్ తో చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక లాంచింగ్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయకపోవడంతో ఈ సినిమా చరణ్ కెరియర్ లో 16 వ మూవీ కావడంతో "ఆర్ సి 16"  అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ ని ప్రారంభించారు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా కనిపించనుండగా ... శివరాజ్ కుమార్మూవీ లో ఈ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

ఎ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. ఇకపోతే నిన్న అనగా మార్చి 27 వ తేదీన చరణ్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ ను మెగా ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ లో భాగంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ... ఇప్పటికే "ఆర్ సి 16" కు సంబంధించిన మూడు పాటలను రెహమాన్ గారు ఇచ్చారు. ఆ పాటలు అదిరిపోయే రేంజ్ లో ఉంటాయి. ఉప్పెన మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ ఎంతటి గొప్ప సాంగ్స్ ఇచ్చాడో ... అంతకు మించిన సాంగ్స్ ను రెహమాన్ "ఆర్ సి 16" కి ఇచ్చారు అని తాజాగా బుచ్చిబాబు రామ్ చరణ్ పుట్టిన రోజు ఈవెంట్ లో బాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: