డీజే టిల్లు సీక్వెల్ టిల్లు స్క్వేర్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న  సంగతి తెలిసిందే. ఐదు రోజుల్లోనే ఈ మూవీకి ఏకంగా 85 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. 40 కోట్ల పైగా షేర్  వచ్చింది.వీక్ డేస్ లో కూడా అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తూ ఉండటం ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. మల్లిక్ రామ్ ఈ మూవీకి దర్శకత్వం వహించారనే సంగతి తెలిసిందే. ఫస్ట్ వీక్ కలెక్షన్లతో ఈ మూవీ ఏకంగా 100 కోట్ల రూపాయల మార్కును దాటే అవకాశం కూడా ఉంది.సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించాయి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కావడంతో ఇప్పటికే పరీక్షలు రాసిన యూత్ ఈ మూవీపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. విజయ్ దేవరకొండ, నాని, నిఖిల్ సినిమాల హైయెస్ట్ ని కూడా ఈ సినిమా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. యువతను ఆకట్టుకునే అంశం ఈ సినిమాకు మేలు చేస్తోంది.


దసరా సినిమా ఫుల్ రన్ లో  120 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోగా గీతా గోవిందం  సినిమాకు ఫుల్ రన్ లో 130 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. అలాగే నిఖిల్ కార్తికేయ 2 సినిమా ఫుల్ రన్ లో 122 కోట్ల దాకా వసూలు చేసింది. ఈ కలెక్షన్ల రికార్డులను టిల్లూ స్క్వేర్ సినిమా బ్రేక్ చేస్తుందా? లేదా? అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. టైర్ 2 హీరోల్లో నాని, విజయ్ దేవరకొండ క్రేజ్ పరంగా ప్రస్తుతం టాప్ లో ఉన్నారు.సిద్ధు జొన్నలగడ్డ ఇలాగే వరుస విజయాలు సాధిస్తే మాత్రం మిడిల్ రేంజ్ హీరోలలో ఖచ్చితంగా నంబర్1 గా నిలిచే అవకాశాలు  ఉంటాయి. ఇండస్ట్రీలో చాలా కాలం నుంచి కొనసాగుతున్న సిద్ధూ ప్రస్తుతం మాత్రం కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి మూవీ సక్సెస్ సాధించేలా సిద్ధు అడుగులు పడుతున్నాయి. డీజే టిల్లు నుంచి సిద్ధు జొన్నలగడ్డను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. టిల్లు క్యూబ్ కూడా హిట్ అయితే సిద్ధూ కూడా పెద్ద స్టార్ అవ్వడం పక్కా. రెండు బ్లాక్ బస్టర్లు కొట్టినా కానీ రెమ్యూనరేయేషన్ విషయంలో ఏమాత్రం కక్రుత్తి పడకుండా పరిమితంగానే ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: