ఇండియాలో ఉన్న ఎంతో మంది నటీ నటులు సినిమాల కోసం ఎంతకైనా తెగిస్తూ ఉంటారు. సినిమాలో ఏదైనా సీన్ డిమాండ్ చేస్తే వారు ఎంత కష్టపడి అయిన సరే ఆ సీన్ ను పూర్తి చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో మలయాళ సూపర్ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఈయన తాజాగా ది గోట్ లైఫ్ "ఆడు జీవితం) అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ కొన్ని రోజుల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యి ప్రస్తుతం మంచి కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తూ విజయవంతంగా దోసుకుపోతుంది. ఇకపోతే ఈ సినిమాలో పృథ్వీరాజ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సునీల్ సినిమాటో గ్రఫీ చేశాడు.

తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఆడు జీవితం సినిమా కోసం పృథ్వీరాజ్ సుకుమారన్ ఎంతో కష్టపడ్డాడు అని తెలియజేశాడు. అలాగే ఒక సన్నివేశం కోసం ఆయన తీవ్రమైన నిర్ణయాన్ని కూడా తీసుకున్నాడు అని ఈయన చెప్పుకొచ్చాడు. అసలు విషయం లోకి వెళితే ... ఆడు జీవితం మూవీ లో ఓ నగ్న సన్నివేశం ఉంటుంది. అది నటించడానికి పృథ్వీరాజ్ ఏకంగా మూడు రోజుల పాటు కట్టిన ఉపవాసం చేశారు. కనీసం మంచి నీళ్లు కూడా ఆయన ఆ మూడు రోజుల పాటు తాగలేదు.

శరీరం లోని మిగిలిన నీటి శాతాన్ని బయటకు పంపేందుకు షూట్ కి ముందు 30 ఎమ్ ఎల్ వాట్కా ను తాగారు. బాగా నిరసించిపోవడంతో లొకేషన్ కుర్చీ లో తీసుకువచ్చాం అని సునీల్ చెప్పుకొచ్చాడు. ఇలా పృథ్విరాజ్ "ఆడు జీవితం" సినిమాలోని ఒక సన్నివేశం గురించి ఇంతలా కష్టపడ్డాడు అని తెలియడంతో ఇతని పర్ఫెక్షన్ కి చాలా మంది ఫిదా అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Prs