తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటన, అందచందాలతో మంచి గుర్తింపును సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ భామ తనదైన నటన, అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయి. 

ఇక తెలుగులో ప్రతి ఒక్క హీరో సరసన హీరోయిన్ గా నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. రకుల్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ స్టార్ హీరోయిన్ గా తన సత్తాను చాటుతోంది. తెలుగులో మాత్రమే కాకుండా హిందీలోనూ తన టాలెంట్ నిరూపించుకుంటుంది. వరుసగా సినిమాలు చేస్తూ అభిమానుల మనసులను ఆకట్టుకుంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానిని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఈ చిన్నది వరుసగా సినిమాలలో నటిస్తోంది.

తన గ్లామర్ డోస్ పెంచుతూ హాట్ గా అందాలను ఆరబోస్తోంది. వివాహం తర్వాత రకుల్ తన వైవాహిక జీవితంలో చాలా సంతోషంగా ఉంది. ఈ క్రమంలోనే రకుల్ కి సంబంధించి ఓ గుడ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని రకాల వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గానే రకుల్ కి సంబంధించిన కొన్ని ఫోటోలలో తాను బేబీ బంప్ తో ఉన్నట్లుగా కొన్ని ఫోటోలు దర్శనమిస్తున్నాయి. ఆ ఫోటోలు చూసి నెటిజన్లు ఈ భామ ప్రెగ్నెంట్ అని కామెంట్లు చేస్తున్నారు. రకుల్ త్వరలోనే తల్లి కాబోతోందని తన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: