టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి పరిచయం అనవసరం. అయితే కొంతకాలంగా నటి సమంత దర్శకుడు రాజ్ నిడిమోరుతో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నట్లు ఇప్పటికే ఐదుసార్లు హింట్స్ ఇచ్చారని టాక్ వినిపిస్తుంది. ఇటీవల శుభం సినిమా టీమ్ తో పాటుగా దర్శకుడు రాజ్ నిడిమోరు కూడా ఆమె పోస్టులో కనిపించారు. సమంత పోస్టులో ఆయన కనిపించడం ఇదేం మొదటిసారి కాదు. పికిల్ బాల్ ఈవెంట్ లో సమంత రూత్ ప్రభుతో, రాజ్ నిడిమోరు కనిపించారు. ఆ తర్వాత రాజ్ నిడిమోరు స్నేహితుడు నిర్వహించిన సమావేశంలో రాజ్ తో సమంత కనిపించింది. అలాగే రాజ్ తో కలిసి సమంత తిరుపతి వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుంది. శుభం ప్రమోషన్స్ లో కూడా రాజ్ నిడిమోరు పాల్గొన్నారు. శుభం సినిమా సక్సెస్ ని ప్రస్తుతం రాజ్ నిడిమోరుతో సమంత జరుపుకుంటుంది. దీంతో సమంత, రాజ్ తో డేటింగ్ లో ఉందని తెలియజేయడానికి ఇలా వరుసగా హింట్స్ ఇస్తుందని టాక్ వినిపిస్తోంది.

ఇకపోతే సమంత తెలుగుతో పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో కూడా చాలా సినిమాల్లో నటించింది. సమంత హిందీ, మలయాళం భాషల్లో కూడా సినిమాలు చేసింది. ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ ల లిస్టులో ఒకరిగా స్థానం సంపాదించుకుంది. అయితే ఈ అందాల భామ ఇప్పటికే నాలుగు ఫిలిం ఫేర్ అవార్డులు , రెండు నంది అవార్డులు సహా అనేక అవార్డులు సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ బ్యూటీ అత్తరింటికి దారేది, ఏం మాయ చేసావె, ఓ బేబీ, యశోద, రామయ్య వస్తావయ్యా, అఆ లాంటి మంచి మంచి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది. సామ్ తన అందం, అభినేయంతో ఎంతమంది ప్రేక్షకుల మనసును దోచుకుంది. సమంత రూత్ ప్రభు నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ అందాల భామ ఏ పోస్ట్ పెట్టిన సరే లక్షల్లో లైకులు, కామెంట్లు వస్తుంటాయి. సమంతకి కేవలం టాలీవుడ్ లోనే కాదు, అటు బాలీవుడ్.. ఇటు కొలివుడ్ లో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. సామ్ అంటే ఇష్టపడని వారుండారు. ఇటీవలే ఈ భామ కోలీవుడ్ గోల్డెన్ క్వీన్ అవార్డుని కూడా సొంతం చేసుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: