
అయితే బడ్జెట్ కలెక్షన్ల లెక్కల విషయంలో కంత్రి మూవీ ఎన్టీఆర్ కెరీర్ లోనే లాభాలు సొంతం చేసుకున్న సినిమాల్లొ ఒకటి. ఆంధ్రావాలా, నా అల్లుడు సినిమాలు ఫ్లాపైనా ఈ సినిమాలకు నష్టాలు రాలేదు. టెంపర్ సినిమాతో తాను రికార్డ్ స్థాయిలో లాభాలు పొందానని బండ్ల గణేష్ తెలిపారు. ఈ సినిమా వల్ల ఈ నిర్మాతకు సంబంధించిన అప్పులు సైతం కొంతమేర తీరాయని సమాచారం అందుతోంది.
టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రమే సినిమా బడ్జెట్ కు అనుగుణంగా తన సినిమాలను మార్కెటింగ్ చేయిస్తూ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందువల్లే దేవర సినిమా సాధారణ టాక్ తో సైతం అసాధారణ విజయాన్ని అందుకుంది. కంత్రి సినిమా బాక్సాఫీస్ వద్ద అప్పట్లోనే 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను అందుకుంది.
ఈ సినిమా పోకిరి సినిమాకు రీమేక్ లా ఉందని కొంతమంది కామెంట్లు చేసినా ఎన్టీఆర్ అభిమానులకు మాత్రం ఈ సినిమా నచ్చింది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ తో రాబోయే రోజుల్లో రికార్డ్స్ క్రియేట్ చేస్తారేమో చూడాల్సి ఉంది. జూనియర్ ఎన్టీఆర్ అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండటం గమనార్హం.