
టాలీవుడ్ లో నిర్మాతలు , పంపిణీ దారులు కలిసి సింగిల్ స్క్రీన్ లను చంపేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్నాయి. అదే మల్టీప్లెక్స్ లలో వారు రెవెన్యూ ఎప్పుడు ఇచ్చినా వారికి మాత్రం రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో సినిమాలు ఇస్తున్నారు. అదే సింగిల్ స్క్రీన్ ల దగ్గరకు వచ్చేసరికి పెద్ద సినిమాలకు రెంట్ సిస్టంలోనూ ... కలెక్షన్లు చాలా తక్కువగా ఉన్న సినిమాలకు అద్దె విధానంలోనూ సినిమాలు ఇస్తున్నారు. అందులో కూడా ముందుగానే భారీ ఎత్తున అడ్వాన్సులు తీసుకుంటున్న పరిస్థితి. ఉదాహరణకు సీ సెంటర్లో ఎన్టీఆర్ - మహేష్ బాబు - ప్రభాస్ లాంటి హీరోల సినిమాలకు అద్దె విధానంలో సినిమా ఇచ్చినా కూడా ముందుగానే ఏకంగా 10 లక్షలు అడ్వాన్సులు కట్టించుకున్న పరిస్థితి. ఆ ధియేటర్లో 10 లక్షలు వచ్చిన తర్వాత వస్తే అద్దె ఇస్తున్నారు ... లేనిపక్షంలో ఒక్కసారి అద్దెలు కూడా సరిగా ఇవ్వటం లేదని సి సెంటర్లో యజమానులు ఆరోపిస్తున్నారు.
నిర్మాతలు , పంపిణీదారులు , ఎగ్జిబిటర్లను సినిమాలు ఇవ్వమని బెదిరించే తీరు వల్లే ఐదేళ్ల క్రితం వరకు రెండు తెలుగు రాష్ట్రాలలో 3,500 వరకు ఉన్న సింగిల్ స్క్రీన్లు ఇప్పుడు 1300 కు తగ్గిపోయాయి సమీప భవిష్యత్తులో ఈ పరిస్థితి మారేలా కనిపించడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే బీ , సీ సెంటర్లలో కూడా రిలీజ్ అవుతున్న సినిమాలు ఇకపై రిలీజ్ అయ్యే పరిస్థితి లేదు. ఇప్పటికే చాలా చోట్ల బీ , సీ సెంటర్లలో కొన్ని సినిమా హాల్స్ మూతపడటం లేదా ఫంక్షన్ హాల్స్‌గాను లేదా కళ్యాణ మండపాలుగాను మారిపోతున్నాయి. వసూళ్లలో న్యాయమైన భాగం దక్కకపోవడం వల్ల నష్టాలు వచ్చి సింగల్ స్క్రీన్లు మూసివేయాల్సి వస్తుందని ఎగ్జిబిటర్లు వాపోతున్నారు. అదే తమకు రాబడి పెరిగితే షేరింగ్ పద్ధతి ప్రకారం వసూళ్లు ఇస్తే థియేటర్లో మూసి వేయకుండా ఎలాగో గల నెట్టుకొస్తామని ఎగ్జిబిటర్లు చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు