- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

టాలీవుడ్ లో ఇకపై సింగిల్ స్క్రీన్ లకు కూడా షేరింగ్ పద్ధతిలో ఆదాయం పంపిణీ చేయకపోతే జూన్ 1వ తేదీ నుంచి తమ ధియేటర్లు మూసివేస్తామని ఇప్పటికే ఎగ్జిబిటర్లు నిర్మాతలు .. పంపిణీదారులకు అల్టిమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. గోదావరి జిల్లాల ఎగ్జిబిటర్లతో మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పాకింది. ఇది ఇలా ఉంటే ఇటీవల ఒక స్టార్ హీరోయిన్ నిర్మించిన లో బడ్జెట్ సినిమా విడుదల అయింది. సినిమాకు మంచి టాక్ వచ్చింది .. సినిమా అంత కాదు ఇంత కాదు సూపర్ అన్నారు. అందరికీ లాభాలు తెచ్చి పెట్టింది అని చెప్పుకున్నారు ఈ సినిమాను హైదరాబాదులోని ఒక ప్రముఖ థియేటర్లో ఎనిమిది రోజులు ఆడిస్తే జనాలు లేక 17 ఆటలు బంద్ చేశారు. అంటే సగటున రోజుకు రెండు షోలు రద్దు అయ్యాయి.


హైదరాబాద్ మెయిన్ సెంటర్లో ఉన్న థియేటర్లో సినిమా చూసేందుకు ఒక షోకు కనీసం 12 మంది ప్రేక్షకులు కూడా రావటం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మల్టీప్లెక్స్ ల లో కూడా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నారు. మల్టీప్లెక్స్ లలో రోజుకు ఐదు షోలు వేసేందుకు అనుమతులు ఉన్న అందులో సగం షోలు కూడా పడట్లేదు. ఇలా అయితే తాము థియేటర్లు రన్ చేయలేమని సింగిల్ స్క్రీన్ యజమానులు చెబుతున్నారు. అదే రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో అయితే కొంతవరకు తాము నష్టాలు భరించగలుగుతామని చెబుతున్నారు. ఏది ఏమైనా పైకి హిట్ సినిమా అని చెప్పుకుంటున్న సినిమాల పరిస్థితి కూడా ఎలా ఉందో చెప్పేందుకు ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: