పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈశ్వర్ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాలో తనదైన నటనతో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ నటన చూసి ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఈ సినిమా అనంతరం ప్రభాస్ వరుసగా సినిమాలలో నటిస్తూ సక్సెస్ఫుల్ హీరోగా తన కెరీర్ కొనసాగించారు. బాహుబలి సినిమాతో ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమాతో ప్రభాస్ క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.


బాహుబలి సినిమా తర్వాత బాహుబలి 2, కల్కి లాంటి అనేక సినిమాలలో ప్రభాస్ నటించడం విశేషం. ప్రభాస్ ప్రస్తుతం నటించే సినిమాలన్నీ పాన్ ఇండియన్ సినిమాలే కావడం విశేషం. తాజాగా ప్రభాస్ నటించిన చిత్రం స్పిరిట్. ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనేను హీరోయిన్ గా ఫైనల్ చేశారు. ఏమైందో తెలియదు గత కొద్ది రోజుల నుంచి దీపికను ఈ సినిమా నుంచి తీసేసినట్టుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.

దీపికను ఈ సినిమాలో హీరోయిన్ గా పెట్టడానికి సందీప్ కు పెద్దగా ఇష్టం లేదట. దీపిక వర్కింగ్ స్టైల్ తనకు అంతగా నచ్చడం లేదట. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ గా మారుతుంది. దీపికా స్థానంలో టాలీవుడ్ బ్యూటీ రష్మికను హీరోయిన్ గా అనుకుంటున్నట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా ఈ సినిమాలో ఎస్ఆర్హెచ్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ను హీరోయిన్ గా పెట్టాలని తన అభిమానులు ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. కావ్య మారన్ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా ఇస్తుందని ప్రభాస్ తో హీరోయిన్ గా కరెక్ట్ గా సెట్ అవుతుందని కొంతమంది అంటున్నారు. దీనిపైన సందీప్ రెడ్డి వంగా ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: