ఏపీలో ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న వాళ్లకు ఇండస్ట్రీ మీద కోపం వచ్చేస్తుంది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా కూడా ఇండస్ట్రీ మీద తమ కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్కట్ రేట్లు భారీగా తగ్గించారు. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సినిమాలు రిలీజ్ అయినప్పుడు టిక్కెట్ రేట్లు తగ్గించడంతోపాటు ప్రభుత్వ అధికారులను థియేటర్లలో తనిఖీల పేరుతో పంపి నానా హంగామా చేశారు. చివరకు సినిమా హీరోలు అందరూ ప్రత్యేకంగా వెళ్లి మరి జగన్ ను కలిసి రావలసిన పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు ఇండస్ట్రీ పెద్దలతో ఎప్పటినుంచో పరిచయాలు ఉన్నాయి. తెలుగు సినిమా పరిశ్రమకు తెలుగుదేశానికి అభినాభావ సంబంధం ఉంది. ఈ క్రమంలోనే కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్ద సినిమాలకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచుకుంటున్నారు.


అంతా బాగానే ఉంది తాజాగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కి ముందు బంధు అంశాన్ని తెరమీదకు తేవడంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు థియేటర్ల మీద కోపం వచ్చింది. చివరికి తన సొంత పార్టీకి చెందిన రాజమండ్రి నగర ఇన్చార్జ్ అత్తి సత్యనారాయణ సైతం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. థియేటర్ యజమానులతో పాటు ఇండస్ట్రీకి చెందిన కొందరు పెద్దరు అంతా కలిసి తన సినిమాను అడ్డుకునే క్రమంలో కుట్ర పన్నారని బలంగా నమ్ముతున్నారు. అందుకే పవన్ ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ ఇప్పుడు శానిటేషన్ , క్యాంటీన్ రేట్లు రెండిటి మీద బలంగా దృష్టిపెట్టారు. మళ్ళీ సింగల్ థియేటర్ల సమస్య ఇది.


మల్టీప్లెక్స్ నిర్వహించినట్టు వాష్ రూమ్లు సింగల్ స్క్రీన్ లలో క్లాస్ గా నిర్వహించలేరు.. కంపు కొడుతూ ఉంటాయి. నిజంగా అధికారులు సీరియస్ గా ఉంటే ఒక్కరోజు కూడా థియేటర్ రన్ చేయలేరు. థియేటర్లకు కాస్త ఆదాయం తెచ్చేది క్యాంటీన్ , కూల్ డ్రింకులు , వాటర్ బాటిల్స్ , పాప్ కార్న్ లు ఇక్కడ అదనపు రేట్ల‌కు అమ్ముతారు. నిజానికి మల్టీప్లెక్స్ తో పోల్చుకుంటే సింగిల్ స్క్రీన్స్‌ లో చాలా తక్కువ రేట్లు ఉంటాయి. వాటి మీద కూడా పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అధికారులు రంగంలోకి దిగి ముమ్మరంగా తనిఖీలు చేస్తే ధియేటర్లు రన్‌ చేయడం కష్టం. ఇప్పటికి థియేటర్ల వ్యాపారం చేస్తున్న వారు మెల్లమెల్లగా వదిలేసుకుని పరిస్థితి వస్తుంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: