సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో విజయ్ సేతుపతి కి పాన్ ఇండియా లెవల్లోఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకప్పుడు దుబాయ్ లో అకౌంటెంట్.. ఇప్పుడు ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో మంచి విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకుంటూ తమకంటూ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో విజయ్ ఒక్కరు .హీరో గానే కాకుండా విలన్ పాత్రలోనూ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మక్కల్ సెల్వన్  విజయ్ సేతుపతి ఆయన గురించి ,ఆయన నటన గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు .హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు .విజయ్ సేతుపతి హీరో గానే కాకుండా విలన్ పాత్రలో మంచి ఫేమ్ ను సంపాదించుకున్నారు.


 విజయ్ సేతుపతి తమిళ్, తెలుగు ,మలయాళం, హిందీ చిత్రాల్లో నటించారు .విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’  అనే సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు, విజయ్ అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించాడు. అలాగే విజయ్ సేతుపతి హీరోగా నటించిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు విజయ్ .ఒకప్పుడు ఆయన తమిళంలో ,నిర్మాతగా, స్క్రీన్ పై రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. తెలుగులోఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడు. ఆ సినిమాలో తనకున్న క్రేజ్ అంతా కాదు. 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ లోనికి ఎంట్రీ ఇచ్చాడు .2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో నటించి తెలుగు ప్రజలకు దగ్గరయ్యాడు .ఇక హిందీలోను నటించి మెప్పించాడు. అక్కడ షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే మేరీ క్రిస్మస్ సినిమాలను నటించాడు .ఇది లా ఉంటే విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో పాల్గొనడం అసలు తనకు ఇష్టం ఉండదు.



 తన సినిమా గురించి అప్డేట్స్ చాలా తక్కువగా ఇస్తూ ఉంటాడు .ఇక ఇంస్టాగ్రామ్ లో ఒకే ఒక హీరోయిన్ ను ఫాలో అవుతున్నారు. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..ఆమె తెలుగు అందాల ముద్దుగుమ్మ ..అంజలి కలిసి ఐరావి, సింధుబాద్  సినిమాలో నటించారు .ఈ మధ్యకాలంలో అంజలి తమిళ్ తో పాటు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమాల్లో కూడా ఎంత క్రేజ్ ఉందో వెబ్ సిరీస్ లో కూడా అంతే ముందుకు దూసుకుపోతూ అందరి మనసులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు..

మరింత సమాచారం తెలుసుకోండి: