తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించి తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరి గా కెరియర్ను కొనసాగిస్తున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగులో డబ్ అయ్యి విడుదల అయ్యాయి . అందులో కొన్ని సినిమాలు తెలుగు బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఉంది. ఇది ఇలా ఉంటే విజయ్ ఆఖరుగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ "గోట్" అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం విజయ్ "జన నాయగన్" అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శర వేగంగా జరుగుతుంది.

ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ సాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ అత్యంత భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను సన్ టీవీ నెట్ వర్క్ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. సన్ టీవీ నెట్ వర్క్ వారు ఈ సినిమా యొక్క శాటిలైట్ హక్కులను ఏకంగా 55 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ తమిళ సినిమాకు కూడా సాటిలైట్ హక్కుల రూపంలో ఇంత పెద్ద డీల్ జరగలేదు అని జన నాయగన్ సాటిలైట్ హక్కులతో భారీ బిజినెస్ ను జరుపుకున్న తమిళ సినిమాగా మొదటి స్థానంలో నిలిచింది అని వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: