బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ అందుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అందం, అభినయం  ఉండడంతో ఫ్యాన్స్ లో స్పెషల్ బేస్ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాకుండా ఎంచుకొనే పాత్రలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా ఉంటున్నాయి. అందుకే హీరోయిన్ లిస్టులో కచ్చితంగా ఈ ముద్దుగుమ్మ పేరు టాప్ లోనే ఉంటుందని చెప్పవచ్చు.. 11 ఏళ్ల క్రితం మొదట మరాఠి సినిమా విట్టి దండు చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.


2018లో లవ్ సోనియా అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత ధమాకా, తుఫాన్, జెర్సీ వంటి చిత్రాలను నటించింది. ఆ సమయంలోనే టాలీవుడ్లోకి సీతారామం చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుంది. తన వింటేజ్ లుక్కుతో మెత్తమరైజ్ చేస్తూ తన అందంతో మరింత ఆకట్టుకుంది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాతో మరి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. ఫ్యామిలీ స్టార్ సినిమా మాత్రం డిజాస్టర్ గా మిగిలిన ప్రభాస్ నటించిన కల్కి 2898 చిత్రంలో ఒక క్యామియో పాత్రలో నటించింది మృణాల్ ఠాకూర్.


ప్రస్తుతం హీరో అడవి శేషు నటిస్తున్న డేకాయిట్ చిత్రంలో కూడా హీరోయిన్గా ఎంపిక అయ్యింది. అలాగే బాలీవుడ్లో 4చిత్రాలలో నటిస్తోంది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడు తాజాగా ఒక అరుదైన ఖాతా అందుకున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ గా నిలిచింది మృణాల్ ఠాకూర్. ఈ విషయంపై అభిమానం వైరల్ గా చేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఈ అమ్మడు పిక్స్ వైరల్ గా మారుతూ ఉంటాయి. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోలను షేర్ చేస్తూ హిట్ పుట్టించే విధంగా తన స్పైసీ అందాలతో పోస్ట్ చేస్తూ ఉంటుంది. మొత్తానికి ఈ ముద్దుగుమ్మ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండడం వల్ల మోస్ట్ పాపులర్ నటిగా పేరు సంపాదించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: