
టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ .. తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రెస్టేజ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ?ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఇటువలే ప్రారంభించగా ఇది ఒక సూపర్ సినిమాగా తెరకెక్క బోతోందని చిత్ర యూనిట్ తెలిపింది. అల్లు అర్జున్ క్రేజ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. దీంతో ఇప్పుడు అట్లీ అల్లు అర్జున్ కోసం సూపర్ హీరో కథాంశంతో సినిమా తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాకు ఓ పవర్ ఫుల్ టైటిల్ను మేకర్స్ పిక్స్ చేసినట్టు తెలుస్తోంది. భారతీయ ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే శక్తిమాన్ అనే పవర్ఫుల్ సూపర్ హీరో టైటిల్‌ను ఈ సినిమాకు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
దీనికి సంబంధించి అనౌన్స్మెంట్ కూడా మేకర్స్ ప్లాన్ చేశారట. త్వరలోనే ఈ భారీ అనౌన్స్మెంట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది. ఇదే టైటిల్ స్ఫూర్తితో మలయాళం నటుడు దర్శకుడు బాసిల్ జోసెఫ్ అల్లు అర్జున్తో ఓ సినిమా చేయబోతున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఈ రెండు వార్తలలో ఏది నిజమవుతుందో చూడాలి ? ఇక అట్లీ సినిమాలో అల్లు అర్జున్ నెక్ట్స్ లెవెల్ లో ఉండబోతుందని టాక్. బాలీవుడ్ స్టార్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నట్టు ఇప్పటికే అనౌన్స్ చేశారు. సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు